Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలను
రద్దు చేయాలి
నవతెలంగాణ-మణుగూరు
యాసంగిలో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, నల్ల చట్టాలను రద్దు చేయానలి విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ, రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మహాధర్నా నిర్వహించారు. రైతు ఏడ్చిన రాజ్యం అభివృద్ధి కాదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టరు తుళ్లూరి బ్రహ్మయ్య, మార్కేట్ కమిటీ అధ్యక్షురాలు ముత్యాలమ్మ, ఆత్మకమిటీ చైర్మెన్ పొనుగోటి భద్రయ్య, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, అడపా అప్పారావు, నాగేశ్వరరావు, ఎంపీపీ విజయకుమారి, నియోజకవర్గం లోని సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పిటీసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : తెలంగాణ వడ్లు కొంటారా? కొనరా అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూని శుక్రవారం తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరిప్రియ, కొత్తగూడెం, మహబూబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఏఎంసీ చైర్మన్ హరిసింగ్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, పులిగళ్ళ మాధవరావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ధర్నాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాల య ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్ర మంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.