Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్
నవతెలంగాణ- ఖమ్మం
లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు. శనివారం ఖమ్మంలో స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు ప్రాసెస్ విధులు నిర్వహించే కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ ఆఫీసర్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరస్ధులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడమే కోర్టు డ్యూటీ ఆఫీసర్ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కోర్టు ప్రాసెస్ డ్యూటీలో ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు సిబ్బందికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రివార్డ్‌లు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె.ప్రసాద్, సిఐలు తుమ్మ గోపి, సాంబరాజు, ఆర్ఐ శ్రీశైలం పాల్గొన్నారు..