Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా వ్యాప్తంగా 5వేల కరపత్రాలు పంపిణీ
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత విద్యా రంగానికి నూతనంగా పరిచయం చేసిన నూతన విద్యా విధానం-2019, పాఠశాల విద్య, ఉన్నత విద్యారంగంలో అనేకమైన మార్పులను సూచిస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా ముసాయిదా విద్యార్థులకు, విద్యా సంస్థలకు కొత్త చిక్కులు తెచ్చిపెడు తుందని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం అన్నారు. దాన్ని విద్యార్థిలోకం తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో విస్తృత ప్రచారంలో భాగంగా 5వేల కరపత్రాలు పంచే కార్యక్రమన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల, వసతి గృహాల్లో, ఆర్టీసీ బస్సులో, వివిధ కార్యాలయాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడారు. గత విద్యా విధాన డ్రాఫ్ట్‌లు పరిశీలన జాతీయ విద్యా విధానం దేశ విద్యారంగానికి ఒక సమగ్రమైన దిక్సూచి లాంటిదని, ఈ దేశ విద్యా వ్యవస్థకు కొన్ని మార్గదర్శకాలతో కూడిన ముసాయిదా అవసరమనే భావన 1964 లో ఏర్పడిందని తెలిపారు.
నూతన ముసాయిదా ఫ్రైవేటైజేషన్ ను ప్రోత్సహిస్తూ భారత విద్యావ్యవస్థలోకి 100 విదేశీ గ్లోబల్ యూనివర్సిటీలకు తలుపులు తెరిచిందన్నారు. ప్రస్తుత సాధారణ డిగ్రీ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలకు పెంచుతూ మల్టీడిసిప్లనరీ కోర్సులు పెట్టే యోచన సాధారణ డిగ్రీ కోర్సు కాల వ్యవధి 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు పెంచాలనీ, బహుళ కోర్సులను ప్రవేశ పెట్టాలని ముసాయిదా సూచించిందని చెప్పారు. నాలుగు సంవత్సరాల కోర్సులో చేరితే మొదటి సంవత్సరం సర్టిఫికెట్ కోర్సుగా, రెండవ సంవత్సరం డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్‌గా, మూడవ సంవత్సరానికి బ్యాచులర్స్ డిగ్రీ, నాల్గవ సంవత్సరానికి పరిశోధనా శిక్షణ డిగ్రీగా డ్రాఫ్ట్ లో పొందుపరచబడిందని వివరించారు. కోర్సుల కాల పరిమితిని పెంచడం ద్వారా డ్రాపవుట్ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, దీని గురించి డ్రాఫ్ట్ ఎక్కడా పేర్కొనలేదని ఆరోపించారు. విదేశీ యూనివర్సిటీల రాకతో ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు తగ్గిపోతాయి, నిర్వహణ కష్టమవుతుంది, వచ్చే ప్రైవేట్, కార్పొరేట్ యూనివర్సిటీల్లో ఫీజు రియంబర్స్మెంట్, రిజర్వేషన్లు ఉండకపోగా, ఇష్టాను సారంగా ఫీజులు పెంచుకుంటూ భారత విద్యా వ్యవస్థను కార్పొరేట్ల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోందని అర్థం చేసుకోవాలని సూచించారు.