Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తల్లాడ
ధాన్యం కొనుగోలుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ రైతుల ను మోసం చేస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ విమర్శించారు. సంఘం మండల మహాసభ శనివారం కళ్యాణ్ కృష్ణ అధ్యక్షతన దొడ్డ కృష్ణయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాదినేని రమేష్ మాట్లాడుతూ పెట్టుబడిదారుల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ రైతు అభివృద్ధి కోసమే పని చేస్తున్నామని మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. సమావేశంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు తాతా భాస్కర్ రావు, పార్టీ మండల కార్యదర్శి, అయినాల రామలింగేశ్వర రావు, సేలం సత్యనారాయణ రెడ్డి, షేక్, నన్నే సాహెబ్, షేక్ మస్తాన్, సాయి లేని ప్రకాశరావు, అనంతోజు సురయ్యా పాల్గొన్నారు.
రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక
తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులుగా కళ్యాణం కృష్ణయ్య, గుంటుపల్లి వెంకటయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 20 మంది సభ్యులతో కమిటీని వేశారు.