Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్తుపల్లి : రైతులపై టీఆర్ఎస్, బీజేపీలది కపటి ప్రేమ అని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, సత్తుపల్లి పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు విమర్శించారు. శనివారం స్థానిక అంబేడ్కర్ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, చావా రమేష్, వెంకట్రావు, సప్పిడి భాస్కర్, చావా రమేష్, రవి, వలి, పాకలపాటి ఝాన్సీ, కుమారి, కవిత పాల్గొన్నారు.
మధిర: తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం), సీపీఐల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందా సైదులు, బెజవాడ రవి, మండవ ఫణింద్రకుమారి, ఊట్ల కొండలరావు, పెరుమాళ్ళ పల్లి ప్రకాశరావు, సీపీఎం జిల్లా నాయకులు శీలం నర్సింహా రావు, రైతుసంఘం మండల కార్యదర్శి చావా మురళి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, సీపీఎం పట్టణ నాయకులు, పడకంటి మురళి, రాధాకృష్ణ పాల్గొన్నారు.
పెనుబల్లి : స్థానిక బిఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు నల్లబ్యాడ్జీలతో శనివారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి చలమల విఠల్ రావు, నాయకులు నల్లమల్ల అరుణ్ ప్రతాప్, గుడిమెట్ల బాబు, చలమల నరసింహారావు, చెమట విశ్వనాథం, తాండ్ర రాజేశ్వరరావు, మామిళ్ల వెంకటేశ్వర్లు , రాములు, పోతిని సత్యనారాయణ, పోతిని కురుమయ్య, సాంబశివరావు, మిద్దె నాగేశ్వరరావు, కోకిల వెంకటేశ్వరరావు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
.వైరా టౌన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేంటనే ప్రారంభించాలని, వైరా రిజర్వాయర్ ఆయకట్టులో వరి పంటకు అనుమతివ్వాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం వైరా మండల అధ్యక్షులు వనమా చిన్న సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైరా మండలం గన్నవరం గ్రామంలో సిపిఐ (ఎం) పార్టీ, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శీలం వెంకటరెడ్డి, లక్కిరెడ్డి వెంకటరామరెడ్డి, రంగిశెట్టి కృష్ణమూర్తి, కష్ణ, ప్రజా సంఘాల నాయకులు కారుమంచి జయరావు, యశోద, పౌలు, రవి, మౌలాలి, మాగంటి సునీల్, దాదాపురం, పాలడుగు, ఖానాపూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి : కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, బిజెపి ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయం వల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన నిర్వహిం చారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కేవీ రామిరెడ్డి, నాయకులు గుడవర్తి నాగేశ్వర రావు, రచ్చ నరసింహారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, దుర్గి వెంకటేశ్వర్లు, మారుతి కొండలరావు, సిరికొండ ఉమామహేశ్వరి మందడపు మురళీకృష్ణ, ఎరదేశి నరసింహారావు, గూగులోతు వీరు నాయక్, పెద్దిరాజ నరసయ్య, మున్నంగి లక్ష్మి, బలుసు ప్రమీల, దండ సూర్యనారాయణ పాల్గొన్నారు.
కారేపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం కారేపల్లి డిప్యూటీ తహసీల్ధార్ లక్ష్మికిి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు తలారి దేవప్రకాశ్, కే.ఉమావతి, ఆరెల్లి రమేష్, శ్రీరాములు, పబ్బుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : మండల కేంద్రంలోని రింగ్ సెంటర్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి గొల్లపూడి కోటే శ్వరరావు రైతులు ఆంగోతు వెంకటేశ్వర్లు, నాగులవంచ వెంకట్రామయ్య, అనుమోలు వెంకటేశ్వరరావు, షేక్ నాగుల్ మీరా, గొబ్బూరి కృష్ణంరాజు, శ్యామలరావు, షేక్ బాబు, జామ్ల నాయక్, క్రిష్ణ నాయక్ పాల్గొన్నారు.
కూసుమంచి: సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి వడ్ల బస్తాలతో ప్రదర్శన చేసి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో సోమవారం నాటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బారి మల్సూర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు యడవల్లి రమణారెడ్డి, శీలం గురుమూర్తి, తోటకూరి రాజు, మల్లెల సన్మంతరావు, సభ్యులు బిక్కసాని గంగాధర్, పందిరి వీరారెడ్డి, తాళూరి వెంకటేశ్వర్లు, అనిత, శీలం జానయ్య, చిట్టూరి వెంకన్న, గడ్డం మురళి పాల్గొన్నారు.
బోనకల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పంట కొనుగోలుపై నాటకాలు మానుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బోనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, సిపిఎం నాయకులు కిలారు తిరుపతయ్య, తెల్లాకుల శ్రీనివాసరావు, షేక్ ఖాదర్ బాబా, చెన్నా లక్షాద్రి, గుడ్డూరి వాణి, గూగులోతు నరేష్, గుడ్డూరి వెంకట నరసయ్య, బత్తినేని రాంబాబు, ఉప్పల శ్రీను, గద్దె రామారావు పాల్గొన్నారు.
ముదిగొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో ఎర్రజెండాలతో ముదికొండలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, నాయకులు మందరపు వెంకన్న, వేల్పుల భద్రయ్య, మర్లపాటి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, రైతుసంఘం మండల అధ్యక్ష కార్యదర్శి కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్, రైతుసంఘం నాయకులు పుచ్చకాయల నాసరయ్య, కోటేశ్వరరావు, సిపిఐ (ఎం) ముదిగొండ గ్రామశాఖ కార్యదర్శి బట్టు రాజు, నాయకులు కట్టకూరు ఉపేందర్ పాల్గొన్నారు.