Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండిత జవహర్ లాల్నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నగరంలోని న్యూవిజన్ పాఠశాలలో బాలలో దినోత్సవాన్ని ముందస్తు వేడుకగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ అబాద్ అలీ తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా స్వయంపాలక దినోత్సవాన్ని నిర్వహించారు. పుస్తకాల సంచులతో కనిపించే చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించడం అబ్బుర పరిచింది. పాఠశాలకు చెందిన కొందరు చిన్నారులు చాచానెహ్రూ వేషధారణతో అలరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు హార్స్ Ê టైల్, మ్యూజికల్ ఛైర్, బ్లైండ్ ఫోల్డ్ మేకప్, బకాసుర, ట్రీసర్ హంట్, బాల్ టన్నల్, కమ్యూనికేషన్ ఛానల్, స్ట్రాగేమ్ వంటి వైవిధ్య ఆటలను నిర్వహించారు. ఈ సందర్బంగా న్యూవిజన్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ అబాద్ అలీ మాట్లాడుతూ దేశ భవితవ్య నిర్మాణం జరిగేది పార్లమెంట్లో కాదు పాఠశాలలోనే అని చిన్నారులను ప్రేమించిన విశిష్ట నాయకుడు నెహ్రూ అని తెలిపారు. ఈ సందర్భంగా న్యూవిజన్ విద్యాసంస్థల ఛైర్మన్ సిహెచ్.జి.కె.ప్రసాద్ మాట్లాడుతూ చిన్న పిల్లల మనస్సులు దోచుకొని, చాచానెహ్రూగా పిలువబడిన భారత తొలిప్రధాని నెహ్రూ సేవలు గురించి కొనియాడారు. తదనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.