Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 131వ పుట్టిన రోజును పురస్కరించుకొని హార్వెస్ట్ పాఠశాలలో ''స్వయం పరిపాలన దినోత్సవం'' వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ రవిమారుత్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులుగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠాలు బోధించారని. తమకిష్టమైన సబ్జెక్టులలో కసరత్తు చేసి పిల్లలకు అద్భుతంగా బోధించారు. విద్యార్ధులకు పాఠాలను బోధించడమంటే ఉపాధ్యాయులు ప్రతిరోజు ఎంత కసరత్తు చేయాలో తమ అనుభవం ద్వారా తెలుసుకున్నామనారు. ప్రిన్సిపల్ పార్వతిరెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు వివిధ రకాల కళానైపుణ్యాలను, వివిధ అంశాల పట్ల అవగాహనను పెంపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, మూసదోరణులతో కాకుండా సృజనాత్మక ఆలోచనలతో ముందుకుపోవాలని అన్నారు. ఆద్యంతం ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయన్నారు. సంస్కతిక కార్యక్రమాలతో పాటు పాఠశాలలోని ఓల్గా, నైలు, అమేజాన్, ఇండస్ గ్రూపుల మధ్య డ్రాయింగ్ కాంపిటీషన్స్, పోస్టర్ మేకింగ్, ఫ్లవర్ అరేంజ్మెంట్, వాల్పేయింటింగ్, రంగోలి, డ్యాన్స్ పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు కరస్పాండెంట్ రవిమారుత్ , ప్రిన్సిపల్ పార్వతీ రెడ్డిలు బహుమతులను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ నాగేశ్వరరావు, ఎం.పి.రాజన్, అకడమిక్ ఇంచార్జ్ శ్యామల, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు