Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రతిష్టాత్మక సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మండలంలోని గంగారం సాయిస్పూర్తి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్ధులు కొలువులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చెన్నుపాటి విజరుకుమార్ తెలిపారు. కళాశాలకు చెందిన ఈసీఈ, ఈఈఈ విభాగాలకు చెందిన విద్యార్ధులు బి.దీపక్, కె.రష్మిత, పి.వాసవి ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై అసిస్టెంట్ సిస్టం ఇంజనీర్లుగా కొలువులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల ఛైర్మెన్, హెటెరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారధిరెడ్డి మాట్లాడుతూ కొలువులు సాధించిన విద్యార్దులను అభినందించారు. విద్యార్ధులను పోటీపరీక్షలకు సిధ్ధం చేసేందుకు టాస్క్ ఆధ్వర్యంలో అనేక వర్క్‌షాప్ కార్యక్రమాలను నిర్వహించిన యాజమాన్య, అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, ఈసీఈ, ఈఈఈ విభాగాధిపతులు కె.రామకృష్ణప్రసాద్, పి.శేఖర్‌బాబు, టాస్క్ ఇంఛార్జి ఎం.సంతోష్ కుమార్ పాల్గొన్నారు.