Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం పటిష్టం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, రాష్ట్ర అధ్యక్షులు జె.జగ్గయ్యలు అన్నారు. సంఘం జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం పట్టణంలోని వాసవి కళ్యాణమండపంలో సంఘం జిల్లా అధ్యక్షులు జీవి.నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యా యులను, స్వచ్ఛ కార్మికుల్ని నియమించాల న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం సంతోషదాయకమ న్నారు. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచాలని, అందుక ు తగిన విధంగా రేట్లు పెంచాలన్నారు. బకాయి పడిన 4 విడతల డిఏ ను(కరువు భత్యాన్ని) విడుదల చేయాలని, 14నెలల పిఆర్సి సిఫారసుల మేరకు జి.ఓలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంకై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటి సభ్యులు షేక్ మహబూబ్ అలి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, సిహెచ్. సుభాషిణి, కార్యదర్శులు సుధాకర్, మంగీలాల్, రంజాన్, నర్సయ్య, గీత, ప్రశాంతి, జి.ఎస్.ఆర్. రమేష్, నాగేశ్వరరావు, శ్రీకాంత్, రాజేశ్వరరావు, లక్ష్మణ్‌రావు, సురేష్, సతీష్, షమి, జిల్లా మాజీ నాయకులు జి.రాజశేఖర్, ఎన్.వీరబాబు, జి. గోపాలకృష్ణ, పి.శరత్ బాబు పాల్గొన్నారు.