Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పెట్రోల్, తాడు వెంట తీసుకెళ్లిన బాధితుడు
అ న్యాయం చేయడంలేదని ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్
అ సొమ్మసిల్లి పడిపోయిన కుటుంబ సభ్యులు
10 గంటలు ఉద్రిక్తత
అ ఆర్డీఓ, తహశీల్దార్్ల హామీతో విరమణ
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి యాజమాన్యం పరిహారం, ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని న్యాయం చేయాలని కోరుతూ నిర్వాసితుడు సుందర్‌లాల్ లోద్ శనివారం గోవింద్ సెంటర్లోని టవర్ ఎక్కాడు. ఉదయం 10గంటలకు టవర్ ఎక్కి సాయంత్రం 6గంటలకు ఆర్డిఓ స్వర్ణలత, తహశీల్దార్ల హామీతో విరమించాడు. బాధితుని వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన సుందర్‌లాల్ ఎడ్లబండి నడుపుతుంటాడు. లోద్ పూర్వీకులకు చెందిన భూములు సుమారు 50 ఎకరాలు జెకె-5 ఓసిలో పోయాయి. పరిహారం, ఉద్యోగం ఇస్తామని ఆనాడు మాయమాటలు చెప్పి సింగరేణి యాజమాన్యం అన్యాయం చేసింది. తన తోటి వారికి పరిహారాలు దక్కాయని తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ గత 3 సంవత్సరాలుగా కలెక్టర్, ఆర్డిఓ, తహశీల్దార్, జిఎం కార్యాలయాల చుట్టు తిరిగాడు. చివరి హైదరాబాదులో ప్రగతి భవన్‌కు సైతం వెళ్లగా అక్కడి సెక్యూరిటీ పోనివ్వలేదు. విసిగిన బాధితుడు శనివారం టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. విషయం తెలుసుకున్న సిఐ రమేష్ సిబ్బంది బాథితునితో ఫోన్లో మాట్లాడారు. విషయం తెలియడంతో భార్య లలిత లోద్, కుమారుడు సంజరు, కూతురు మాలతిలు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. టవర్‌పైన చూసి సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం తేరుకున్న కుటుంబ సభ్యులు సమస్య పరిష్కరించాలని కాపాడాలని అక్కడే ఉన్న సిఐ, ఎస్టేట్ అధికారుల కాళ్ళపై పడ్డారు. పైరింజన్ను తెప్పించారు. డీఎస్పి రవీంద్ర రెడ్డి, సింగరేణి, పైర్ అధికారులు, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత మైక్ పెట్టి సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పె ప్రయత్నం చేశారు. గోవింద్ సెంటర్ నాలుగు కూడళ్ళ రోడ్లు ఉండటంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జనం అంతా రోడ్డమీదకు వచ్చారు. ఉఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐ రమేష్ సుమారు 6 గంటల సేపు మైక్‌లో నచ్చజెప్పారు. జిఎం కార్యాలయానికి స్వయంగా తీసుకెళ్ళి సమస్య పరిష్కరిస్తానని కిందికి దిగాల్సిందిగా కోరారు. హామీ ప్రతం ఇప్పించాల్సిందిగా నిర్వాసితుడు కోరారు. దీంతో ఎస్టేట్ అధికారి హామీ పత్రం తయారు చేసి చూపించారు. కొడుకుకు ఉద్యోగం కోసం అపాయింట్మెంట్ ఆర్డర్, పరిహారం ఇప్పించాలని జీఎం కలెక్టర్ రావాలని పట్టుపట్టాడు. సీఐ రమేష్ కృషితో సాయంత్రం 6 గంటలకు ఆర్డీఓ స్వర్ణలత, తహశీల్దార్ల కృష్ణవేణిలు సంఘటన స్ద్థలానికి వచ్చి ఇద్దరికి కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగం ఇస్తామని, భూములకు సంబంధించిన డాక్యుమెంట్ పరిశీలించి పరిహారం ఇస్తామని సోమవారం కలెక్టర్ కార్యాలయానికి రావాలని సూచించడంతో బాధితుడు చల్లబడ్డాడు. టవర్ నుండి కిందికి దిగాడు.