Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ స్థాయిలో మెరుగైన, నాణ్యమైన వైద్యం అందిస్తుందనడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవిబాబు సమ్మయ్య కు నిర్వహించిన ఫేషియల్ రీ కన్స్ట్రక్షన్ సర్జరీ నిదర్శనని, రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీషర్రావు అన్నారు. అక్టోబర్ 26వ తేదీన పాల్వంచ మండలం, రేగులగూడెం గ్రామానికి చెందిన మొక్కటి సమ్మయ్య,58 సంవత్సరాలు, సమీపంలోని అడవికి మేతకు పశువులను తీసుకెళ్లిన సమయంలో అడవిదున్న దాడిచేసింది. ఈ దాడిలో తీవ్రంగా సమ్మయ్య గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటనలో అతని ముక్కు ఛిద్రమై, ముక్కు పక్క టెముకలు విరిగడంతో పాటు ముఖ భాగంలో మాంసం ఊడిపోయి ప్రాణాపాయ స్థితిలో వైద్య చికిత్సకు కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిలో చేరాడు. సమ్యయ్య పరిస్థితి గమనించిన డాక్టర్ రవిబాబు అతని పరిస్థితి గమనించి ఛాలెంజ్‌గా తీసుకుని ఫేషియల్ రీ కన్స్ట్రక్షన్ సర్జరీ నిర్వహించారు. మునుపటి సమ్మయ్య ముఖం పూర్వ స్థితికి తీసుకొచ్చారు.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ డాక్టర్స్ చేసిన సేవలకు ప్రశంసించారు. వైద్య రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారనడానికి నిదర్శనం ఈ ఘటన అని, అరుదైన శస్త్ర చికిత్సతో సమ్మయ్య ప్రాణాలు కాపాడిన జిల్లా ఆసుపత్రిలో ఈఎన్టి వైద్యాధికారి డాక్టర్ రవిబాబుతో పాటు అతని వైద్య బృందాన్ని అభినందించారు. చికిత్సలు అనంతరం సమ్మయ్య ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్య వంతునిగా కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లడం చాలా సంతోషమని చెప్పారు. ఇదే చికిత్స ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహిస్తే దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోందని సమ్మయ్యకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించామని సర్జరి చేసిన డాక్టర్ రవిబాబు తెలిపారు.