Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
బోనకల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ఘనంగా వనసమారాధన, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం వనభోజనాల కార్యక్రమాలను నిర్వహించారు. కోవిడ్ కారణంగా మండలంలోని వివిధ కుటుంబాలలో కొంత మంది మృత్యువాత పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పోపూరి నరసింహారావు, బి ఎన్ సీతారామయ్య, మాడుగుల జగన్, చల్లా రాణి, కోదుమూరి సుబ్బమ్మ కుటుంబాలకు మండల ఆర్యవైశ్య సంఘం తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్త్రీలకు, పురుషులకు వివిధ రకాల పాటలు పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. నూతన ఆర్యవైశ్య సంఘం మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడిగా 'చెడే'
బోనకల్ మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా రావినూతల గ్రామానికి చేడే వెంకటేశ్వర రావు, మండల కార్యదర్శిగా కలవల వెంకట లక్ష్మీ నారాయణ (బాబు), కోశాధికారిగా గుర్రం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులుగా కటకం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా రంగా జనార్దన్ రావు ఎన్నికయ్యారు.
బోనకల్ పట్టణ అధ్యక్షులుగా తుమ్మలపూడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా మిరియాల రవి ప్రసాద్, కోశాధికారిగా చెన్న భాను, ఉపాధ్యక్షులుగా తెల్లాకుల శ్రీనివాసరావు, సహాయక కార్యదర్శిగా పుల్లఖండం నాగేశ్వర రావులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారిగా కొంతం లక్ష్మీ నారాయణ గుప్త, ఎన్నికల కన్వీనర్ వీరవలి రాజేష్, దేవరశెట్టి వెంకట సతీష్ వ్యవహరించారు. ఈ వనసమారాధన కార్యక్రమంలో బోనకల్ మండలంలోని వివిధ గ్రామాల ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.