Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
ఎఫ్ఆర్సీ కమిటీ తీర్మానం, గ్రామ సభ ఆమోదం పొందిన ప్రతి పోడుసాగుదారునికి, నేటి వరకు సాగులో ఉన్న ప్రతి రైతుకు పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో గిరి ప్రసాద్ నగర్ ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనాదిగా ఆదివాసీలు, బలహీన వర్గాల ప్రజలు పోడుసాగు చేస్తున్నారని, ఆ భూమి ఆధారంగా పోడు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గత 50 ఏళ్లుగా భూమిని సాగుచేస్తున్న పోడు రైతులకు భూమిపై హక్కులేక అభద్రతా భావంతో జీవించారని... నేటికైనా ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, కీసరి గంగరాజు, దేవా, అర్జున్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.