Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ
ఇంచార్జీ ఆర్జెసి కృష్ణ
నవతెలంగాణ-గాంధీచౌక్
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఓటర్ల చేర్పులు, మార్పులు, అనర్హుల తొలగింపు కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధికారులకు సహకరించాలని ఆ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ గుండాల(ఆర్జేసీ) కృష్ణ పిలుపునిచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మూడవ పట్టణ ప్రాంత ముఖ్య నాయకులు, కార్యకర్తల సంయుక్త సమావేశం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షతన ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగాణా భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో కృష్ణ అతిధిగా పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రేణులు ఆయా డివిజన్ల నుండి ఇతర ప్రాంతాలకు పలు కారణాల వల్ల తరలిన వారిని గుర్తించి డివిజన్ కమిటీ, బూత్ కమిటీలతో చర్చించి ఓటర్ల తొలగింపు, చేర్పింపు, మార్పులపై నిర్ణయం తీసుకొని అధికారుల కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, రాష్ట్ర మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ళ రవికిరణ్ మాట్లాడుతూ ప్రతీ ఒక్క నాయకుడు,కార్యకర్త సీనియర్ జిల్లా,నగర నాయకుల సలహాలు, సూచనలు తీసుకొని ఈ కార్యక్రమం పై కార్యక్రమం పై అవగాహన పెంపొందించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ఇసాక్, సీనియర్ నాయకులు వంగాల వెంకట్, మండదపు రామకృష్ణ, ఎస్సి విభాగం నగర అధ్యక్షులు తొగరు భాస్కర్లతో పాటు ఆయా డివిజన్ల ముఖ్యనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.