Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
ఐకేపీ ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలంలోని సదాశివునిపాలెం, కిష్టారం, రామానగరం గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటా ఒక్కింటికి రూ. 1960, సి గ్రేడ్ రూ. 1940 చొప్పున మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని ఏపీఎం సుబ్బారావు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల రైతు సమన్వయ కమిటీల బాధ్యులు, ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.