Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
అందరికీ విద్య వైద్యం ఉపాధి అందించాలనే నినాదంతో డివైఎఫ్ఐ నిరంతరం కృషి చేస్తుందని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని మీనవోలు గ్రామంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఎరుపాలెం మండల 11వ మహాసభ కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య కామ్రేడ్ జానకి రామయ్య ప్రాంగణంగా నామకర ణం చేసి మహాసభను ప్రారంభించారు.ఎర్రు పాలెం డీవైఎఫ్ఐ మండల మహాసభ ప్రారంభ సూచికంగా డివైఎఫ్ఐ జెండాను ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ క్యాలెండర్ ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని మీనవోలు గ్రామంలో గల ప్రధాన సెంటర్ నందు కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్య క్రమంలో బండారు శ్రీనివాస్, సామినేని మహే ష్, తాళ్లూరి అంకాల రావు, మౌలాలి, స్వామి, రాఘవేంద్ర రహీం, బాజీ, తిరుపతి, నాగరా జు, కోటేశ్వరరావు, శ్రీను, తదితరులు పాల్గొ న్నారు.
డీవైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులుగా దివ్వెల వీరాంజనేయులు, రామిశెట్టి సురేష్లను మండల మహా సభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.