Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి రామారావు
అ యూనియన్ లో కి భారీ చేరికలు
నవతెలంగాణ-పాల్వంచ
కార్మికుల హక్కుల సాధనకు (హెచ్-142) యూనియన్ నిరంతరం పోరాడుతుందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రామారావు అన్నారు. ఆదివారం ప్రాంతీయ కార్యాలయంలో ఆ యూనియన్లో కార్మికులు భారీగా చేరారు. కేటీపీస్ 5, 6, 7వ దశల నుండి యస్.కె. సయ్యద్, బి. సుమన్, కె. శ్రీనివాస్, ఎం. శివరాం, యన్. మోహనరావుతో సహా 10 మంది కార్మికులు వివిధ యూనియన్ల నుండి చేరారు. వారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి రామారావు యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎల్లపుడు కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగి మంచి పోరాట పటిమతో తమ యూనియన్ ముందుకు సాగుతుందని రామారావు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యస్. శ్రీనివాసచానిరి, సత్యారాజ్ స్టీవెన్, బొల్లెపోగు రవి, మోకాళ్ళ శ్రీనివాసరావు, భూక్యా రవి లు పాల్గొన్నారు.