Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
సహకార సంఘాలు రైతుల అభివృద్ధికి పాటుపడతాయని సంఘం అధ్యక్షులు రవి వర్మ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఈ బయ్యారం క్రాస్రోడ్లో గల పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు ఆయన సంఘం పతాకాన్ని ఆవిష్కరణ చేసారు. సహకార సంఘం ద్వారా అనేక మంది రైతులకు తక్కువ ధరకే గుణాలు ఉన్నాయని సహకార సంఘం అధ్యక్షులు రవి వర్మ తెలియజేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటరెడ్డి, డైరెక్టర్లు కొండేరు రాము, గునిగంటి సమ్మయ్య, సంఘ సీఈవో చింతాల రాంబాబు, సంఘ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.