Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
వీది వ్యాపారుల కోసం తహసిల్దార్ కార్యాలయం పక్కన నూతనంగా నిర్మించిన షెడ్లు ప్రారంభానికి ముందే పగుళ్ళు నిర్మాణంలో సరైన పరిణామాలు పాటించటం లేదని బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షుడు ముదిగొండ జయంత్ అన్నారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిస తాసిల్దార్ కార్యాలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న షెడ్లను సందర్శింశారు కానీ వీటి పనుల నిర్మాణంలో సదరు గుత్తేదారు నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి నాసిరకంగా నిర్మాణాలు చేశారని విమర్శించారు. షెడ్ల నిర్మాణంలో పలు చోట్ల పగుళ్ళు, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు వీది వ్యాపారుల కోసం నిర్మిస్తున్న షెడ్ల పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా వ్యాపారులకు కేటాయించకపోకపోవడం లోని ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు సదరు షెడ్లు ఆసాంఘీక కార్యక్రమాలకు, మందు బాబులకు అడ్డాగా మారిందని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి నాసిరకం నిర్మాణాలు చేసిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని, వ్యాపారులకు షెడ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడెల్లి శ్రీను, ఉప్పు.దుర్గాప్రసాద్, బాలరాజు,నాయీమ్ పాషా తదితరులు పాల్గొన్నారు.