Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చాకచక్యంగా వెనుకగా వెళ్లి రక్షించిన
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్చార్జి కృష్ణ
నవతెలంగాణ-సత్తుపల్లి
ప్రేమ వివాహం చేసుకున్నాడని కుమారుని పట్టించుకోకుండా ఉండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ కుమారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని, డాబా పైకెక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సత్తుపల్లిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ రోడ్డు నెం.4లో నివాసముంటున్న గునగంటి వెంకటేశ్వరరావు, వెంకమ్మ దంపతుల కుమారుడు రామకృష్ణ గత 14 యేండ్ల కిందట అనూష అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ససేమిరా ఇష్టంలేని ఆ కుటుంబం రామకృష్ణను పట్టించుకోవడం మానేశారు. వేరేచోట జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం రామకృష్ణకు ఇద్దరూ ఆడపిల్లలు. ఆదివారం తన సొంతింటికి వచ్చి నన్ను మీరెవరూ పట్టించుకోవడం లేదని, నాకు ఇద్దరూ ఆడపిల్లలేనని, నాకు ఇంట్లో ఓ పోర్షన్ ఇస్తే తాను ఉంటానని తల్లిదండ్రులను కోరడం జరిగింది. నీకు ఏమీ ఇచ్చేది లేదని, అసలు నీవు మా కుమారుడవు కానే కాదని చెప్పడంతో మనస్థాపం చెంది కిరోసిన్ పోసుకుని వాళ్లింటి డాబా పైకెక్కి కిందికి దూకి చస్తానని బెదిరించాడు. విషయం తెలిసిన పోలీసు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దిగి రమ్మన్నా రాకపోవడంతో బతిమిలాడే ప్రయత్నం చేస్తుండగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి రామిశెట్టి కృష్ణ ఎంతో చాకచక్యంగా గబాలున వెళ్లి రాయకృష్ణను గట్టిగా పట్టుకుని కిందికి తీసుకువచ్చాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకని కౌన్సెలింగ్ ఇచ్చారు. రామకృష్ణ తల్లిదండ్రులను మందటించారు. పిండు ప్రాణాన్ని రక్షించిన రామశెట్టి కృష్ణను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది, పలువురు అభినందించారు.