Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
రైతులు పండిచిన వానా కాలపు వరి ధాన్యాన్ని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘంలోనే విక్రయించి లాభాలు పొందాలని ఆ సంఘం అధ్యక్షులు పరుచూరి రవికుమార్ రైతులను కోరారు. ఆదివారం 68వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భముగా చర్ల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయము నందు ఆయన సహకార జెండాను ఎగురవేసినారు. ఈ కార్యక్రమమును ఉద్దేశించి రైతులు పండించిన వానాకాలం వరి పంటను సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యము అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్-''ఎ'' రకం క్వింటాల్ కి రూ.1990, సాధారణ రకం క్వింటాల్కి రూ.1940 పొందగలరని తెలియజేసి నారు.
సహకార వారోత్సవాలు నేటి నుంచి నుండి 20 వరకు వారం రోజుల పాటు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించుట జరుగుతుందని తెలియజేసినారు.
ఈ కార్యక్రమములో సంఘ డైరెక్టర్లు సుందరి పెద్దిరాజు, దుబ్బా సత్యం, సంఘ మాజీ అధ్యక్షులు పోలిన రామచంద్రరావు, రైతులు శశెట్టి సాంబశివరావు, నాగసత్య శ్రీకాంత్, వేములపల్లి హరిశంకరరావు, సంఘ సీఈఓ ఎస్డీ జిలాని, జూనియర్ అసిస్టెంట్ కె.యోజనవల్లి సంఘ సిబ్బంది పాల్గొన్నారు.