Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంకు సమీపంలోని మేడువాయిలో ఉన్న పాల్ రాజ్ ఇంజనీరింగు కళాశాలలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ పాల్ రాజ్ విగ్రహాన్ని ఆదివారం వేమూరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు నాగార్జున, వనమా వెంకటేశ్వరరావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే నాగార్జున మాట్లాడుతూ పాల్ రాజ్ ఎంతో ఉన్నతమైన వ్యక్తిని, వేమూరు ఎమ్మెల్యేగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఆయన అన్నారు. అలాగే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ప్రాంతాల్లో ఇంజనీరింగు కళాశాలల స్థాపించి ఎంతో మంది పేద ,గిరిజన విద్యార్థులకు ఇంజనీరింగు విద్యను అందించారని ఆయన అన్నారు. మారుమూల ప్రాంతంలో ఇంజనీరింగు కళాశాల స్థాపించడం అప్పట్లో పెద్ద విషయమేనని పేర్కొన్నారు. ఎంతో మంది ఇంజనీర్లను అందించిన ఈ కళాశాలలో పాల్ రాజ్ విగ్రహం పెట్టడం అభినందనీయమని అన్నారు. భద్రాచలం డివిజన్లో చర్చిల ద్వారా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు పాల్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ డీజీఎం చెంగల్రావు. డాక్టర్ తెల్లం వెంకట్రావు, కళాశాల చైర్మన్ వి.వరలక్ష్మి, కరస్పాండెంటు జకరయ్య, వైస్ ప్రిన్సిపాల్ హథీరామ్, కరస్పాండెంటు రాజశేఖర్, తాండ్ర రమణ, కోన ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు.