Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
నూతన విద్యుత్ చట్టం వెంటనే రద్ధుచేయాలని యూఈఈయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శి బొల్లి వెంకటరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చర్లలో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడారు. నూతన విద్యుత్ చట్టం వలన ప్రభుత్వరంగంలో వున్న విద్యుత్ సంస్ధలు మొత్తం ప్రైవేటు పరం అవుతాయని ప్రజలపైన చార్జిల భారం పెరుగుతుందని అన్నారు. గృహా అవసరాలు, వ్యవసాయం వంటి రంగాలకు ఇస్తున్న సబ్సీడిలు రద్దు అవుతాయని అన్నారు. ప్రభుత్వరంగం మొత్తం ప్రైవేటు పరమైతే దేశభవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అన్నారు. విద్యుత్ రంగంతో పాటు రైల్వే, కోల్, సహా అన్నింటిని బీజేపీ ప్రభుత్వం అమ్మెస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూఈఈయూ కునురాజు శ్రీనివాస్, బి.రమేష్, పదిలం శ్రీనివాస్, కనుకు సత్యనారయణ, బి.వెంకటేశ్వర్లు, సందీప్, కారం శ్రీను, కృష్ణ, విజరు కుమార్, విక్రమ్ పాల్గొన్నారు.