Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సొసైటీ చైర్మన్ మండె వీరహనుమంతరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
అఖిలభారత 68వ సహకార వారోత్సవాల భాగాంగ ఆదివారం సంఘ కార్యలయం నందు సొసైటీ అధ్యక్షులు మండి వీరహనుమంతరావు సహకార పతాకాన్ని ఎగురవేసారు. చుంచుపల్లి మండలం, విద్యానగర్ కాలనీలో ఉన్న సహకార సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి యన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు మాట్లాడుతు ఈ సహకార వారోత్సవాలు నంవటర్ 14 తేది నుండి 20వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ వారోత్సవాలలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో, ఆరోగ్య సహకార సంఘాలను బలోపేతం చేయడంలో సహకార రంగం పాత్ర, సహకార మర్కెటింగ్ వినియోగదారులు, ప్రాసెసింగ్, విలువ పెంపు సహకార సంఘాల కొరకు వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పన, వృత్తి, నైపుణ్యాన్ని పెంచడంలో సహకార సంఘాల పాత్ర కీలకం అన్నారు. రైతులకు నిత్యం అందుబాటులో సహకార సంఘాలు ఉంటాయని తెలిపారు. సహకార సంఘాల ద్వారా కేవలం పంట రుణాలు ఇవ్వటంమే కాక రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫర చేయటం రైతులు పండించిన పంటలను ప్రభుత్వ మద్దతు ధరకు కుడా కొనుగోలు చేయటం వంటి అనేక రకాలు సేవలు రైతులు ఈ సహకార రంగం చేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్నాధ రావు, సీనియర్ ఇన్ స్పెటకర్ ఆదినారాయణ, సొసైటీ సీఇఓ పి సారయ్య, సొసైటీ డైరెక్టర్లు బండి అమృత రావు, కర్ణాటకపు రాంచందర్ రావు, పోటు వెంకటేశ్వర రావు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జీలు రైతులు పాల్గోన్నారు.