Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ మండల అద్యక్షులు భాస్కర్
నవతెలంగాణ-గుండాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుపై విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడు తనమే అవుతుందని టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోడు భూములపై మాట్లాడేందుకు వచ్చిన గిరిజన సంఘాల నాయకులతో రేగా మాట్లాడలేదని, కమీషన్లకు కక్కుర్తి పడుతున్నట్లు వైయస్సార్ టీపీ పినపాక నాయకులు అలెం కోటి నోటికి వచ్చినట్లు మాట్లాడడం గురిగింజ సామెతను గుర్తుచేస్తుందన్నారు. రేగాపై మతిలేని మాటలు మాటలు మాట్లాడిన వ్యక్తి ఏ పార్టీ నుండి ఏ పార్టీకి మారాడో ఈ ప్రాంత ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను వ్యతిరేకించిన వైఎస్ జగన్, షర్మిల పార్టీల జెండాలు మోసే వ్యక్తి రేగాను విమర్శించడం అతని దిగజారుడు, దివాళా కోరు రాజకీయాలకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు. పోడు భూములపై టీఆర్ఎస్ పార్టీకి ఒక స్పష్టత ఉందని, ఒక పక్క కమీటీలు వేస్తూ శాస్వత పరిష్కారానికై అడుగులు వేస్తున్న విషయాన్ని గమనించలేక ఆంధ్రా పాలకుల మోజులో పడి, పదవీ కాంక్షతో ఉన్నటువంటి అలెం కోటికి తెలంగాణ ప్రజల మనోభావాలు కనిపించడం లేదా!అని హితవుపలికారు. రేగా కాంతారావుపై వైయస్సార్ టీపీ పినపాక నాయకులు చేసిన విమర్శలను టీఆర్ఎస్ మండల కమిటీ తరపున తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొగ్గెల లక్ష్మినారాయణ, ముత్తాపురం సర్పంచ్ పూనెం సమ్మయ్య, మోకాళ్ళ బుచ్చయ్య, కల్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.