Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఢిల్లీలో కోల్ ఇండియా చైర్మెన్‌కు వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు మొదటి క్యాటగిరి వేతనం చేయాలని, హైపవర్ వేతనాలు అందజేయాలని ఇఫ్య్టూ జాతీయ అధ్యక్షురాలు అపర్ణ, సింగరేణి గౌరవ అధ్యక్షులు టి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం న్యూఢిల్లీ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఇఫ్ట్యూ ఆధ్వర్యంలో కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్‌కు వినతి అందజేశారు. అనంతరం ఇఫ్య్టూ జాతీయ నేతలు మాట్లాడారు. 2012లో 9 వేతన ఒప్పందంలో హైపవర్ కమిటీ వేతనాలు ఒప్పందం చేసి సింగరేణిలో అమలుచేయలేదన్నారు. పెరిగిన వేతనాలు ప్రొడక్షన్ సైడ్ కోల్ ఇండియాలో అమలు అవుతున్నాయని సింగరేణిలో అమలు కావడంలేదని తెలిపారు. మొదటి క్యాటగిరి వేతనాలు అమలు చేయాలన్నారు. సింగరేణిలో లాభాలు వస్తున్నాయని లాభాలలో పనిచేస్తున్న 30వేల మంది కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం వల్లనే సింగరేణిలో లాభాలు వస్తున్నాయని ఈ లాభాలకు కారకులైన కాంట్రాక్టు కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. జెబిసీసీఐ నాయకులకు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు ఫస్ట్ట్ క్యాటగిరి వేతనంతో పాటు ఎక్స్‌గ్రేషియా ఇన్సూరెన్స్ నష్ట పరిహారం పండగ సెలవులు జాతీయ పండగ సెలవులు తదితర సమస్యలు పరిష్కరించే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఏ.వెంకన్న, సహాయ కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మానందం, ఎన్.సంజీవ్, బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, నరసయ్య, యాదగిరి, మల్లేష్, రామగుండం మనోజ్, రజిత, రమేష్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.