Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం
నవతెలంగాణ-కొణిజర్ల
తహశీల్దార్ కార్యాలయంలో చెయ్యి తడిపితేనే సర్టిఫికేట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి. ఆదాయం, కుల ధ్రువీకరణ, రెసిడెన్షి యల్, ఒబిసి, ఈడబ్యూఎస్, నాన్ క్రిమిలేరియర్, ఫ్యామిలీ మెంబర్, ఆగ్రికల్చరర్ లాంటి సర్టిఫికేట్ లకు మీసేవ కేంద్రాల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని తహశీల్దార్ కార్యాలయంకి వచ్చిన తర్వాత ఓ అధికారిని సర్టిఫికేట్లు సమయానికి జారీ చేయడంలో అలస్యం చేస్తూన్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇన్కామ్ సర్టిఫికేట్ నుంచి ఆగ్రికల్చరర్ సర్టిఫికేట్ల వరకు డబ్బులు ఇవ్వనిదే దరఖాస్తు దారులు ఇచ్చిన పత్రాలను రాయకుండా ఆమె దెగ్గర పెట్టుకొని మీరు పెట్టిన దరఖాస్తులో అన్ని సక్రమంగా లేవని కసురుకుంటు సమాధానం చేబుతుంటుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతిరోజు సర్టిఫికేట్ ల కోసం కార్యలయం చూట్టూ తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉదహరణకు గుండ్రాతిమడుగు సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొని రెండు నెలలు గడుస్తున్నా వారికి నేటి వరకు సర్టిఫికేట్లు జారీ చేయకుండా కార్యలయం చూట్టూ తిప్పుకుంటున్నారు. సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం కొడుకుని తీసుకొని నల్లగట్ల నాగమణి రెండు నెలలుగా తిరుగుతున్న ఆర్ఐ తన దెగ్గర లేదని, తాను రాసి ఎఎస్ఓకు పంపాను అని సోమవారం నాగమణికి చెప్పడంతో ఎఎస్ఓ దెగ్గరికి వెళ్లి ఆమెను అడగడంతో ఫైల్ నా దెగ్గరకు రాలేదని, వెళ్లి ఆర్ఐనే కలవండి అంటూ అటుఇటూ తిప్పుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు ఆగ్రికల్చరర్ లోను తీసుకునేందుకు ఆగ్రికల్చరర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకొని రెండు నెలలు గడుస్తున్నా అతనికి సర్టిఫికెట్ నేటి వరకు అందలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలో నెలల తరబడి పెండింగ్లో సర్టిఫికెట్లు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి సర్టిఫికెట్ల కోసం కార్యాలయానికి వచ్చే లబ్ధిదారులకు వీలైనంత త్వరగా అందజేయాలని, అదేవిధంగా సర్టిఫికెట్దారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారినిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.