Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వామపక్షాల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అటవీ హక్కుల దరఖాస్తుల స్వీకరణ గడువును మరో పది రోజుల పాటు పెంచాలని కోరుతూ సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ వర్షా రవికుమార్‌కు అందజేశారు. దీంతో ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోతానని హామీ ఇచ్చారు. ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. పోడు రైతుల ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు హక్కుల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారని వారు అన్నారు. కుల ధృవీకరణ పత్రాలు లేక చాలా మంది పోడు రైతులు దరఖాస్తులు అందించలేదన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ నెల 17, 18 తేదీని ఆఖరు దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీగా ప్రకటించిందని స్వీకరణ గడువు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, సీపీఐ నాయకులు రవికుమార్, రామిరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా నాయకురాలు కల్పన, సాయన్నతో పాటు వివిధ గ్రామాలకు చెందిన పోడు రైతులు పాల్గొన్నారు.