Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాజకీయ జోక్యం నివారించాలి
అ సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు రమేష్
నవతెలంగాణ-ఇల్లందు
జిల్లాలో కొన్నిచోట్ల ఇంటి పన్నులు చెల్లిస్తేనే పోడు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు మెలిక పెట్టడం చట్టవిరుద్ధమని తక్షణం ఉపసంహరించు కోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఏజె.రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ మండల కమిటీ సమావేశం ఎం.లక్ష్మీ అధ్యక్షతన ఏలూరి భవన్లో సోమవారం జరిగింది. ఈ సమావేశంనుద్దేశించి వారు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం నిబంధనల మేరకు చట్టానికి లోబడి పోడు సాగుదరులకు పట్టాలు ఇవ్వాలన్నారు. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం నిబంధనలకు లోబడి పోడు సాగుదరులకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చే ఈ సందర్భంలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని, అవినీతికి తావు లేకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్సీ కమిటీల జోక్యంతోనే పట్టాలు ఇవ్వాలని అన్నారు. పోడు సాగుదారులు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం ఒకరి మీద ఒకరు బురద జల్లే కార్యక్రమాన్ని మానేసి రైతులు పండించే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబి, సీనియర్ నాయకులు దేవులపల్లి యకయ్య, తాళ్లూరి కృష్ణ, వజ్జ సురేష్, మన్నెం మోహన్ రావు, కూకట్ల శంకర్, అలెటి సంధ్య, కాలంగి హరికృష్ణ, మాదరపు వెంకటేశ్వర్లు, రాము పాల్గొన్నారు.