Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని దుమ్ముగూడెం వైద్యశాల ఆవరణలో వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ క్రీడలు సోమవారంతో ముగిశాయి. ఈ క్రీడల్లో మండల నలుమూలల నుండి పలు గ్రామాలకు చెందిన 40 టీములు తలపడగా విన్నర్స్ గా కొత్త మారెడుబాక టీం నిలవగా రన్నర్స్‌గా కాశీ నగరం టీం గెలుపొందింది. గెలుపొందిన టీమ్‌లకు సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మలు మొదటి, రెండోవ బహుమలు రూ.పదివేల, రూ.5 వేల నగదుతో పాటు షీల్డ్ అందజేశారు. క్రీడలు విజయవంతానికి సర్పంచులు సరియం సీతారామయ్య, తెల్లం రామకృష్ణ, యం.రాజేష్‌లు తమ వంతుగా సహాయ సహకారాలు అందించినట్లు వనవాసి కళ్యాణ పరిషత్ మహిళ మండల కార్యదర్శి మడకం భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడ ప్రముఖ కొమరం రఘుపతి, ప్రకండ ప్రముఖ సున్నం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.