Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి
అ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-భద్రాచలం
రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం పంటను కొనుగోలు చేయకుండా, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ దొంగ నాటకాలు ఆడుతున్నాయని సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం విమర్శించారు. పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధాన్యం పంట కొనుగోలు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ప్లకార్డులు చేతబూని స్థానిక అమరవీరుల సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెళ్ల లీలావతి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో దోబూచులాడుతూ, ఒకరిపై ఒకరు దొంగ ధర్నాలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేయకుండా దొంగ నాటకాలాడుతున్నారని విమర్శించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూమి సాగు చేస్తున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం గంగా, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, నాగరాజు, శ్రీనివాస్, జీవన జ్యోతి, లక్ష్మీకాంత్, అన్వేష్, భూపేంద్ర పాల్గొన్నారు.