Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో గల అంబాసత్రం నందు అభినయ కూచిపూడి నాట్యాలయం వ్యవస్థాపకులు చల్ల కొండలరావు, వారాహి సంగీత అకాడమీ వ్యవస్థాపకులు వానిరామ్ ఆధ్వర్యంలో రామనామ కీర్తనం కూచిపూడి నర్థనం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఉదయం 9గంటల నుండి రాత్రి 9గంటల వరకు 11గంటల పాటు నిర్వీరామంగా జరిగిన ఈ కార్యక్రమం భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది. ఈ కార్యక్రమం అనంతరం చిన్నారులకు సర్టిఫికెట్, మెమొంటో అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు బోగాల శ్రీనివాస్ రెడ్ది, ఐటీసీ కాంట్రాక్టర్, కళా పోషకులు పాకాల దుర్గా ప్రసాద్, ప్రభుత్వ పోలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్, భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోఆర్డినేటర్ ప్రసాద్, జేడీ ఫౌండేషన్ నాగరాజు విచ్చేసి చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు.