Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
వరి ధాన్యం నాణ్యతా ప్రమాణాలపై రైతులకు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పిస్తామని మండల వ్యవసాయాధికారి వై.నవీన్ తెలిపారు. సోమవారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, పీఏసీఎస్ అశ్వారావుపేట పరిధిలో అశ్వారావుపేట, ఊట్లపల్లి, జమ్మిగూడెం, అచ్యుతాపురం, పీఏసీఎస్ నారాయణపురం పరిధిలో నారాయణపురం, వినాయకపురం, గుమ్మడవల్లి పంచాయతీల్లో ఈ కేంద్రాలు నిర్వహిస్తామని అన్నారు. మండలంలో ఈ ఖరీఫ్‌లో 3461 మంది రైతులు,7259 ఎకరాల్లో వరి ధాన్యం పండించారని తెలిపారు. ఆయన వెంట ఏఈఓలు రాయుడు, షకీరా బానులు ఉన్నారు.