Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వర్షపు వరదల్లో వరి చేలు, నేలపాలు
అవుతున్న పత్తి
అ అకాలపు వర్షాలతో రైతులకు తీరని నష్టమే
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రతి ఏడు రైతులు విపత్తులతో చిత్తు అవుతూనే ఉన్నారు...చేతి కందిన పంటలు చేజారిపోతుంటే కంట తడే తప్ప వారి ఓదార్చే నాధుడే కరువయ్యాడు. ఈ ఏడాది గోదావరి వరదలు, ఆకాలపు వర్షాలతో వరి, పత్తి రైతులకు తీవ్ర నష్టం పోయారనే చెప్పవచ్చు. వ్యవశాయ అధికారులు పంట నష్టం అంచనా అంటూ సర్వేలు చేసినా రైతులకు ఏనాడు పంట నష్టం పరిహారం అందించిన పాపాన పోలేదు అనే చెప్పవచ్చు.
దుమ్ముగూడెం మండలం పూర్తి వ్యవశాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ప్రజలు పూర్తిగా వ్యవశాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. మండలంలో వరి, పత్తి సాగుతో పాటు మిర్చి సాగును ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటారు. మండల వ్యాప్తంగా సుమారు 25 వేల ఎకరాల్లో వరి, 18 వేల ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు. ఈ ఏడాది తొలకరి ప్రారంభంలో వాతావరణం రైతులకు సాగుకు సానుకూలంగా ఉండడంతో రైతులు అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తంలోనే వరి, పత్తి సాగు చేశారు. కాగా మండలంలో వర్షాబావం ఆధారంతో 1010 మూడు నెలల వరి సాగును సుమారు 3 వేల ఎకరాలలో సాగు చేశారు. గత నెల 15, 16 తేదీలలో కురిసిన మోస్తరు భారీ వర్షాలకు 1010 వరి పలు చోట్ల నేల వాలి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. దీంతో పాటు గత రెండు రోజులుగా అడపా దడపా పలు చోట్ల కురుస్తున్న వర్షాలకు వరి చేలు చాలా చోట్ల చాపలా వాలి నీళ్లల్లో తేలాడుతున్నాయి. బాడవ ప్రాంతాలలో నీట మునిగిన వరి చేలను కాపాడు కోవడం కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలకు గండ్లు పెట్టి వర్షపు నీటిని బయటకు పంపేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఏది ఎమైనా చేతి కందిన పంటలు ఆకాలపు వానలతో చేజారి పోతుంటే రైతులు కంట తడి పెడుతున్నారనే చెప్పవచ్చు.
పత్తి రైతులకు తీరని నష్టమే
ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉందనుకున్న సమయంలో వాతావరణ మార్పులతో వరుసగా కురుస్తున్న వర్షాలకు తీరని నష్టం తెచ్చి పెటిందనే చెప్పవచ్చు. పత్తి పూత కాత మీద ఉన్న సమ యంలో కురిసన వర్షాలకు పూత కాత రాలి పోయింది. పత్తి చేతుకందుతున్న సమయంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికి అందుతున్న పత్తి తడిసి ముద్ద కావడంతో పాటు నేల రాలి పోతుంది. దీంతో పాటు కాయ నల్లబారే మ్రాదం ఉంది. తడిసిన పత్తి నల్లబారితే రైతుకు గిట్టు బాటు ధర వచ్చే పరిస్తితి లేదనే చెప్పవచ్చు. ఏది ఎమైనా ప్రతి ఏడు రైతులు విపత్తులతో తీవ్రంగానే నష్ట పోతున్నారనే చెప్పవచ్చు.