Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాజేశ్వరపురంలో నేడు ప్రారంభం
నవతెలంగాణ-నేలకొండపల్లి
కార్తీక పౌర్ణమి సందర్భంగా నేటి నుండి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, ఎద్దుల బలప్రదర్శన పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల సందర్భంగా క్రీడాకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు పిఎసిఎస్ చైర్మన్ తన్నీరు కృష్ణమూర్తి, రాసాల కనకయ్య, బోనగిరి కిరణ్ తెలిపారు. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజేశ్వరపురం గ్రామంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలతో పాటు ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు గ్రామంలోని దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కోలాట బృందం వారిచే నృత్య ప్రదర్శన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రారంభిస్తారన్నారు. ముఖ్య అతిథులుగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం హాజరవుతున్నారన్నారు. ఈ పోటీలలో క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.