Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-మణుగూరు
విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విశ్రాంతి ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు చంద్రశేఖరుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ పీఆర్సి నివేదిక అనంతరం 2021లో జారీ చేయబడిన జీఓలో 5 జీఓలను విడుదల చేసింది. నూతన ఫించన్ల చెల్లింపులు జరుగుతున్న సందర్భంలో అత్యంత ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.