Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్
నవతెలంగాణ-వైరా టౌన్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగులో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలు నుండి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు, విద్యాసంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తమ చదువులకు స్వస్తి పలుకుతున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి విద్యార్థులు ఫీజు కట్టి సర్టిఫికెట్స్ తీసుకోవాలని, లేకపోతే రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవాలని కళాశాల యాజమాన్యం ఖరాఖండిగా చెబుతున్నారని అన్నారు. దీనివలన పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలో మానేసి ఇతర పనులకు