Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, ధరలు తగ్గించాలని, పౌర సరఫరాల శాఖ ద్వారా అన్ని రకాల సరుకులు ఇవ్వాలని ఐద్వా పట్టణ కార్యదర్శి సందకూరి లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఐద్వా కేంద్ర కమిటీ పిలుపు మేరకు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ఆరోపించారు. రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వడం లేదని, ఈ సమస్యలపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నానరని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలని లేకపోతే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కమిటీ నాయకురాలు అన్నవరపు ఇందిర, నందిపాటి రజిత, ఏ.పద్మ, రమా, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.