Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం/కొత్తగూడెం లీగల్
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరెక్రిష్ణ భూపతి బదిలీ అయిన సందర్భంగా ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం వీడ్కోలు కార్యక్రమంలో నిర్వహించారు. అదే విధంగా కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా సన్మానించారు. ఈ సందర్భంగా హరెక్రిష్ణ భూపతి న్యాయవాదులనుద్దేశించి ప్రసంగిస్తూ న్యాయవాదుల సహకారం మరవలేనిదని అన్నారు. బార్ మరియు బెంచ్ సంబంధాలు చాలా బాగున్నాయని అన్నారు. కరోనా కాలంలో న్యాయస్థానల్లో కేసుల పరిష్కారం జరగక పోయిన, తదనంతరం కోర్టుల్లో దావాలు నడుస్తున్నాయని, అందరి సహకారంతోనే కేసులను పరిష్కరించానని, మీ అందరినీ వదిలి వెళ్ళడం బాధ కల్గించినా, జ్యుడీషియల్ అకాడమీకి వెళ్ళడం సంతోషం కల్గించినదని అన్నారు. బార్ మన్ననలు పొందడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తి సి.హరెక్రిష్ణ భూపతి నాకు గురువుని, వారి మార్గదర్శనంలో పనిచేయడం నాకు సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తి అన్ని విధాలుగా సహకరించి, పలు సమస్యలు పరిష్కరించడంలో చొరవచూపారన్నారు. పనిచేసేన కొద్దికాలంలో న్యాయవాదుల మన్ననలు పొందారని అన్నారు. కుంటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి డానిరూత్ మాట్లాడుతూ అకాడమీ లో న్యాయమూర్తి శిక్షణ లో అనేక విషయాలు నేర్చుకోని మరల ఖమ్మంలో ఆయన మార్గదర్శకంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తి సేవలను కొనియాడారు. కొత్తగూడెం బార్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ కొత్తగూడెంలో న్యాయమూర్తి చేతుల మీదుగా పోస్కో కోర్టు ప్రారంభించారని, శాశ్వత కోర్టుల భవన సముదాయానికి ఎంతో కషి చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్, డానిరూత్, శ్యామ్ శ్రీ, అఫ్రోజ్ అక్తర్, ఎన్.అనితా రెడ్డి, పి.మౌనిక, భారతి, కార్యవర్గ సభ్యులు కోనా చంద్రశేఖర్ గుప్తా, ఇమ్మడి లక్ష్మీ నారాయణ, కృష్ణా రావు, గురుమూర్తి, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు భారీగా హాజరై న్యాయమూర్తికి ఘనంగా శాలవాలు, పూలమాలలతో సన్మానించారు.
ఇదే కార్యక్రమంలో న్యాయవాదులు దేవకి శ్రీనివాసరావు, వాసవిదేవిలు ఖమ్మం న్యాయవాద సంక్షేమ సొసైటీకి వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్దం వాటర్ ఫిల్టర్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పబ్లిక్ అడిషనల్ ప్రాసిక్యూటర్స్ పోసాని రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, బార్ ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.