Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలి
అ జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల అంబేద్కర్
నవతెలంగాణ-గాంధీచౌక్
ఎంపీటీసీల ముఖ్యమైన ఆరు డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల అంబేద్కర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లాల ఎంపీటీసీల అత్యవసర సమావేశం పట్టనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల లోపు తమ న్యాయ మైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఎమ్మెల్సీ బరిలో ఎంపిటిసిలు పోటీలో ఉంటారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిబ్రవరి 9న ఒక ప్రకటన చేస్తూ మార్చి బడ్జెట్లో 500 కోట్లు ప్రకటించడం జరిగిందని, కాని మా సమస్యలు తీరలేదన్నారు. సంవత్సరానికి ప్రతి ఎంపీటీసీకి 20 లక్షల చొప్పున 1200 కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. సభ్యునికి 15వేల గౌరవ వేతనం పెంచాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక గది ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో జెండా ఎగురవేసే గౌరవాన్ని కలిపించాలన్నారు. స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీల నిధులు జిల్లా మండల పరిషత్తు ద్వారా కేటాయించాలని అన్నారు. సమస్యల పరిష్కారానికై స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఇద్దరికీ చట్టసభల్లో మండలిలో ప్రాతినిధ్యం ప్రస్తుత ఎన్నికల్లో కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు కొల్లు పద్మ, ఉపాధ్యక్షురాలు భూక్య స్వాతి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు గబ్రూ నాయక్, వివిధ మండలాల ఎంపిటిసిలు సంఘం అధ్యక్షులు గుర్రం బాబురావు, ధరాల రామ్మూర్తి, శాంత కుమారి, మూడ్ గణేష్, గురువయ్య, వంశీ కృష్ణ, మానస, వివిధ మండలాల ఎంపిటిసిలు నండ్ర ప్రసాద్ సుంచు వెంకటేశ్వర్లు, చాట్ల భగవాన్ పాల్గొన్నారు.