Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
సాగులో ఉన్న పోడు సాగుదారులు అందరికీ పట్టాలు ఇవ్వాలని జడ్పీటీసీ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తుంగారం బోర్డు దారులతో కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 పూర్వం నుండి తుంగారం రేపల్లెవాడ పంచాయతీలో పోడు భూమిని సాగు చేసుకుంటున్నారని, ఫారెస్ట్ అధికారులు భూమి సాగు చేయకుండా చేసి మొక్కలు నాటారని ఇప్పుడు మాకు పోడు కమిటీ వేయకుండా చూడటం సరికాదన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పోడుదారులు, టీఆర్ఎస్ నాయకులు భానోత్ బిలు, కాంగ్రెస్ నాయకులు ధారావత్ రామారావు తదితరులు పాల్గొన్నారు.