Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
సహృదయ సేవా ఫౌండేషన్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో గత 6 నెలలుగా నిరు పేద కుటుంబాలకు చేయూతనందిస్తున్న సహృదయ సేవా ఫౌండేషన్ ఫౌండర్ కం ప్రెసిడెంట్ తుళ్లుబెల్లు సునీత తెలిపారు. గత 4 సంవత్సరాలుగా నిరుపేద వితంతు, వికలాంగుల కుటుంబాలకు, వృద్దాశ్రమంలోని వృద్ధులకు రోడ్ మీద బిక్షాటనతో జీవిస్తున్న అభాగ్యులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో భాగంగానే సహృదయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలని గుర్తించి మదర్ ధెరిసా జాతీయ స్థాయి అవార్డును మంగళవారం హుజురాబాద్‌లో మీడియా అకాడమీ ఫెడరేషన్ అఫ్ ఇండియా వారు జాతీయ మదర్ థెరిస్సా ఎక్సలెన్స్ అవార్డును ప్రధానం చేశారు. హుజూరాబాద్‌లో జరిగిన అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో పీపీసీడబ్ల్యు న్యూస్ ఛానల్ ఎమ్డీ పెండ్యాల సుమన్, పీవీపీ జ్యూడిషియల్ డిపార్మెంట్ సూపెరిండేంట్ అంజనీ కుమారి, అమ్మ, నాన్న సేవ సొసైటీ చైర్మన్ సీత మహాలక్ష్మి చేతుల మీదగా ఈ అవార్డును ప్రధానం చేశారు. సునీతకు జాతీయ స్థాయి అవార్డు రావడం పట్ల సహృదయ ఫౌండేషన్ సభ్యులు కుటుంబ సభ్యులు, రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులు మరికొందరు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.