Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన సీపీఐ పార్టీ సీనియర్ నాయకులు అన్నెం జమ్మి రెడ్డి మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటఅని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రామ్ ప్రసాద్ అన్నారు. మంగళవారం గుండె పోటుతో మృతి చెందిన అన్నెం జమ్మి రెడ్డి పార్థివ మృత దేహాన్ని రావులపల్లి రాంప్రసాద్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మిరెడ్డి చివరి వరకు నిస్వార్థంగా ఎర్ర జెండా పక్షానే నిలబడి పేదల పక్షాన పోరాడిన వ్యక్తి అన్నారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ నాయకులు రావులపల్లి రవికుమార్, వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి కుంజా శ్రీనివాసరావు, నాయకులు సుధాకర్ రెడ్డి, రామిరెడ్డి, అకోజు సునీల్ కుమార్, సీపీఐ(ఎం) నాయకులు సూర్యచందర్ రావు, ఏఐఎస్ఎఫ్ డివిజన్ నాయకులు మారెడ్డి గణేష్తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.