Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
తెలంగాణ ప్రగతిశీల హమాలీ, మిల్లు వర్కర్స్ ఫెడరేషన్(ఐఎఫ్టీయూ), వ్యాపారస్తులకు మధ్య హమాలీల రేట్ల పెంపుదల కోసం మండల కేంద్రంలో మంగళవారం చర్చలు జరిపి హమాలీ రేట్ల పెంపునకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గత రేట్ల పైన అదనంగా 26 శాతం రేట్లు పెంపునకు వ్యాపారస్తులు అంగీకరించినట్లు ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాసారపు వెంకన్న తెలిపారు. పెరిగిన హమాలీ రేట్లు 16-11-21 మంగళవారం నుండి అమల్లోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతరాములు, ఎస్కే అజ్గర్, ఈసం క్రిష్ణన్న, హమాలీ నాయకులు గడ్డం నగేష్, చేబోతు రవి, ధనరాజ్, బాల్య కిరణ్, వ్యాపారస్తులు వెంకన్న, ప్రభాకర్, మంగయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.