Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మండల వ్యాప్తంగా రైతులపై వేధింపులు ఆపాలని రైతుసంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్ అన్నారు. మంగళవారం రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడేళ్ల క్రితం పీఏసీఎస్ బ్యాంకు ద్వారా రైతులకు పాడిగేదెలకు సంబంధించిన మొదటి, రెండవ దఫా రుణాలు ఇవ్వడం జరిగిందని, ఆ గేదెలకు నేటివరకు ఎలాంటి సబ్సిడీ రాలేదన్నారు. డీసీసీబీ బ్యాంకు మేనేజర్, సిబ్బంది ప్రతిరోజూ రైతులను గేదెల రుణాలు కట్టాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేధింపులు ఆపకపోతే బ్యాం కుల ఎదుట ధర్నా రైతులతో చేస్తామని హెచ్చరించారు. మరోపక్క ధాన్యం కల్లాల్లో ఆరబోసి వాతావరణ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతు న్నారని, రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పొడియం వెంకటేశ్వర్లు, గోపగాని లక్ష్మీనరసయ్య, చనగాని చంద్రశేఖర్, ముత్యాలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.