Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దబ్బనూతుల వద్ద లీకులతో వృధాగా
శుద్ధ జలాలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పధకం లీకుల మిషన్ భగీరథ పధకంగా తయారైంది. నిత్యం ఏదో ఒక చోట పైపు లైన్లు లీకేజీలతో శుద్ధ జలాలు వృధాగా పోతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు వారం పది రోజుల పాటు మిషన్ భగీరధ నీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం దబ్బనూతుల గ్రామంలో మిషన్ భగీరధ పైపు లీకేజీతో నీరు రహదారుల వెంబడి వృధాగా పోతుంది. దబ్బనూతుల గ్రామంలో ఏర్పాటు చేసిన సంపు ద్వారా లీకేజీ అయిన పైపు లైన్ నుండి కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా దబ్బనూతుల, కొత్తూరు, చిన్నకమలాపురం, పెద్దకమలాపురం గిరిజన గ్రామాలకు మిషన్ భగీరధ నీరు నల్లాల కనెక్షన్ల ద్వారా ఇళ్లకు చేరుతుంది. కానీ ఆయా గ్రామాలకు మిషన్ భగీరధ నీరు వెళ్లే ప్రదాన పైపు లీకేజీ కావడంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగు నీరు అందని పరిస్తితి నెలకొంది. దీంతో పాటు ఇదే సంపు ద్వారా ఎర్రబోరు వెళ్లే పైపు లైన్ రహదారుల పనులు చేస్తున్న సమయంలో మూసుకు పోయింది. దీంతో ఎర్ర బోరు గ్రామ ప్రజలకు 6 నెలలు గా మిషన్ భగీరధ శుద్ధ జలం అందని పరిస్థితి నెలకొంది. మూసుకు పోయిన పైపు లైన్ పనులతో పాటు పైపులైన్ లీకేజీ మరమత్తులు వెంటనే చేపట్టి మిషన్ భగీరధ ద్వారా శుద్ధ జలాలు అందించేలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.