Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వజీర్
నవతెలంగాణ-పాల్వంచ
ఆర్టిజన్ కార్మికుల సెలవులకు సంబంధించి విడుదలైన జీవో వెనక తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 కృషి ఫలితమే జీవో వచ్చిందని, ఆ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఏ.వజీర్ అన్నారు. మంగళవారం యూనియన్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఆర్టిజన్ కార్మికుల సెలవులకు సంబంధించిన జీవో రావడానికి యూనియన్ కృషి చేసిన వివరాలను తెలిపారు. పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తామని, కార్మికులు అధైర్య పడవద్దని తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రల్ కమిటీ కార్యదర్శి రాధాకృష్ణ, జెన్కో అధ్యక్షులు పి.రాము, ఎం.శ్రీధర్ గౌస్, ఉద్దీన్, అక్కినపల్లి వెంకటేశ్వర్లు, వి.దానయ్య, బండి నాగరాజు, బాలాజీనాయక్, బషీర్, నర్సిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.