Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఐద్వా పట్టణ కమిటీ ఆద్వర్యంలో కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు తగ్గించాలని ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కమిటీ అధ్యక్షురాలు డీ.సీతాలక్ష్మీ మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. టమాట కేజీ రూ.80, పచ్చిమిర్చి రూ.50, చింతపండు రూ.100 ఇలా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆమె అన్నారు. ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చినట్టే ఇచ్చి ప్రజలకు గ్యాస్ ధర అందుబాటులో లేనంత దర పెంచి ప్రజలపై పెనుభారం ఈ పాలక ప్రభుత్వాలు మోపుతున్నారని ఆమె ఆరోపించారు. కరోనాతో ఇబ్బంది పడే ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్ నాదెళ్ల లీలావతి, జిల్లా కమిటీ నెంబర్ సున్నం గంగ, ఐద్వా పట్టణ ఆఫీస్ బేరర్ జీవన జ్యోతి, పట్టణ కమిటీ సభ్యులు రమణ, చుకమ్మ, ఆదిలక్ష్మి, సక్కుబాయి, నక్క చిట్టెమ్మ, నాగమ్మ, సమక్క తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : నిత్యవసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ఐద్వా జిల్లా అద్యక్షురాలు సరియం రాజమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం కన్నాపురం గ్రామంలో జరిగిన ఆ సంఘం అత్యవసర సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యవసర సరుకులను పేదలకు, మద్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విదంగా ధరలు తగ్గించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చిన్ననల్లబల్లి, కాశీనగరం సర్పంచ్లు మిడియం జయ, కనకదుర్గలతో పాటు నాగలకీë, రాజేశ్వరి, సంద్య, అన్నపూర్ణ, కృపావతి, బేబీ తదితరులు పాల్గొన్నారు.