Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిర్వహించిన శోతోకాన్ కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో చర్ల మండలం జీపీ పల్లి విద్యార్థులు ఇర్ప లవన్ కుమార్, ఇర్ప రామారావు కాంస్య పథకాలు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఇర్పా ఉమ, సెక్రెటరీ గుగులోత్ రామ్ నాయక్, విద్యార్ధులను అభినందించారు. ప్రధాన ఉపాధ్యాయులు చింతా రామ్మోహనరావు, ఉపాధ్యాయ సిబ్బంది కే.జయమ్మ, అనిల్ కుమార్, రవిలు పాల్గొన్నారు. విద్యార్థులు విజ్ఞానంతో పాటు క్రమ శిక్షణ, పోటీతత్వం అలవరచుకొని ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని విద్యార్ధులను అభినందించారు. కరాటే కోచ్ సాంబయ్య బ్లాక్ బెల్ట్ 5వ డాన్, శ్రీ తాటి నర్సింహ రావులకు కృతజ్ఞతలు తెలియజేశారు.