Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సీపీఐ(ఎం) కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా లిక్కి బాలరాజు ఎన్ని కయ్యారు. స్ధానిక పాత కొత్తగూడెంలో సోమవారం జరిగిన 7వ పట్టణ మహాసభలో 11 మంది నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా ఎన్నికైన లిక్కి బాల రాజు మాట్లడుతూ రానున్న కాలంలో ప్రజా పోరటాలను ఉధృతం చేయాలని పట్టణంలో ప్రజాసమస్యలను గుర్తించి వాటి సాధన కోసం భవిష్యత్ పోరాటాలు రూపకల్పన చేయను న్నట్టు ఆయన తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో ఏండ్ల తరబడి నివాసం ఉంటూ క్రమబద్ధీకరణ పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వకుం డా ఉచిత హామీలతో ప్రభుత్వాలు పట్టణ ప్రజలను పదేపదే నయ వంచనకు గురి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారల అనుమతి లేకుండా నిర్మించిన ఇండ్లు కూల్చి వేత పేరుతో సామాన్యుల ఇండ్లు కూల్చుతున్నారే తప్ప, పెద్ద, పెద్ద బడా వ్యాపారస్తులు, అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్ళ ట్లేదని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో తాత్సారం జరుగుతుందని తక్షణ మే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయా లని, అర్హులను గుర్తించి వారికి పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చి హామీ మేరకు సింగరేణి ప్రధాన ఆసుపత్రిని మెడికల్ కాలే జీగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత విద్యార్ధులకు మెడికల్ విద్య అందేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పట్టణంలో నివసిస్తున్న ప్రధా నంగా అసంఘటిత రంగ కార్మికులు మధ్య తరగతి, మహిళ సమస్యలపై భవిష్యత్ పోరాటాల రూప కల్పన చేయనున్నట్లు ఆయన తెలియచేశారు. నూత న పట్టణ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిలో భూక్య రమేష్, సందకూరి లక్ష్మి, జునుమాల నగేష్, డి.వీర న్న, కర్ల వీరస్వామి, జయశ్రీ, అనిల్, విజయగిరి శ్రీను, ఆవుల శ్రీరాములు, రమేష్‌లు ఉన్నారు.